![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -147 లో..... కన్నాని చూడడానికి మహా ఇంటికి వెళ్తుంది. మహాని నారాయణ చూస్తాడు. నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని నారాయణ అంటాడు. నేనేం ఇక్కడే ఉండిపోవడానికి రాలేదని మహా అంటుంది. మహా లోపలికి వెళ్లేసరికి ఇల్లంతా చిందరవందరాగా ఉంటుంది. కన్నా, నేను బయట ఉంటాం ఇల్లంతా శుభ్రం చెయ్యండి అని మిగతా వారికి మహా చెప్తుంది. మాధవ, కేశవ, చక్రి ముగ్గురు కలిసి ఇల్లంతా క్లీన్ చేస్తారు. నాకు టీ కావాలి పెద్ది అని మహా అంటుంది. నీచేతి టీ లాగా మరెక్కడా ఉండడం లేదని మహా అంటుంది. అయితే ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని చక్రి అంటాడు. దాంతో తన వంక కోపంగా చూస్తుంది మహా.
ఆ తర్వాత కన్నాకు మహా తన ప్లేట్ లో ఉన్న దోశ తినిపిస్తుంది. హాస్పిటల్ కి వెళ్ళావా అని మహా అడుగుతుంది. వెళ్ళానని కన్నా చెప్తాడు మళ్ళీ వెళదామా అని మహా అంటే హ వెళదాం నేను తీసుకొని వెళ్తానని చక్రి అంటాడు. నువ్వు సైలెంట్ గా ఉండరా అని చక్రితో మాధవ అంటాడు. ఆ తర్వాత వదిన మనం గుడికి వెళదామని కన్నా అంటాడు. ఇద్దరు కలిసి గుడికి వెళ్తుంటే అందరూ మహాని చూసి ఏంటి వెళిపోయావట కదా అని అడుగుతుంటే మహా ఇబ్బంది పడుతుంది. ఇద్దరు గుడి లోపలికి వెళ్తారు. అక్కడికి చక్రి వచ్చి మాట్లాడుతుంటే మహా కోప్పడుతుంది. ఆ తర్వాత కన్నా మహా మాట్లాడుకుంటారు. మా చక్రి అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా ఇంటికి వస్తావా వదిన అని కన్నా అడుగుతాడు. మిమ్మల్ని ఎవరు విడదీస్తారురా మీరు ఎప్పుడు కలిసి ఉండలని మహా అంటుంది. నాకు ఆఫీస్ కీ లేట్ అవుతుందని మహా వెళ్తుంటే తాయారు వచ్చి కంగ్రాట్స్ అమ్మ ఆ ఇంట్లో నుంచి వచ్చినందుకు ఆ మనుషులకు కూడా దూరంగా ఉండు అంటూ నారాయణ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడి వెళ్ళిపోతుంది మహా. మా ఇంటికి శాపం ఉందంటే నమ్మలేదు వదిన.. మీరు వెళ్లాక అర్ధం అయింది. ఈ ఆడవాళ్లు మా ఇంట్లో ఉండరని కన్నా చెప్తూ ఎమోషనల్ అవుతారు. మహా ఆఫీస్ కి లేట్ గా వెళ్తే అక్కడ కుమార్ తన పై సీరియస్ అవుతాడు. విక్కీ వచ్చి మాట్లాడుతాడు జూనియర్స్ తో ఫ్రెండ్లీగా ఉండి పని చేయించుకోవాలని చెప్తాడు.
ఆ తర్వాత శైలు కోసం కేశవ వెయిట్ చేస్తాడు. శైలు వచ్చి పక్కకి దాక్కొని నిన్న నన్ను మధ్యలో వదిలేస్తావా వెయిట్ చెయ్ అనుకుంటుంది. ఇంకా వచ్చేలా లేదని కేశవ వెళ్తుంటే శైలు వచ్చి ఆపుతుంది. ఇక నుంచి నాతో నువ్వు చాటింగ్ చెయ్యాలి.. ఫోన్ మాట్లాడాలని చెప్తుంది. ఇప్పుడు కలిసాం కదా.. మళ్ళీ ఏం మాటలు ఉంటాయని కేశవ అంటాడు. తరువాయి భాగంలో నారాయణ ఇంటికి పేరంటానికి పిలవడానికి ఆడవాళ్లు వస్తారు. ఇంట్లో ఆడవాళ్లు ఉంటే పిల్వండి బొట్టు పెట్టి పిలుస్తామని వాళ్ళు అంటారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లు ఎక్కడుంటారని తాయారు ఎంట్రీ ఇస్తుంది. అప్పుడే మహా ఇంట్లో నుంచి హారతితో బయటకు వస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |